ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NLR: రాపూరు పట్టణంలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక కేజీ వరి ధాన్యం ధర రూ. 23.89 పైసలు, 75 కిలోలు బ్యాగ్ రూ.1791.75 లెక్కన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.