VIDEO: తాడుతో వంతెన గోడెక్కి.. రాకపోకలు

MDK: భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టు వరద ధాటికి మెదక్-ఎల్లారెడ్డి వైపు వెళ్లే జాతీయ రహదారి అప్రోచ్ రోడ్డు 100 మీటర్లకుపైగా కొట్టుకుపోయింది. వాహనాలు వెళ్లలేక వంతెనకు ఉన్న గోడకు తాళ్లు కట్టుకుని ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. తాడు సాయంతో ఎక్కేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమాత్రం పట్టు తప్పినా నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉంది.