'పూడికతీత పనులు త్వరగా చేపట్టండి'

NLR: బుచ్చిపట్టణంలోని ముంబై జాతీయ రహదారి వద్ద ఉన్న కాలువలో ఈనెల 9వ తేదీ పూడికలు తీస్తామని నగర కమిషనర్ బాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాలువపై ఉన్న ఆక్రమణలను వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తొలగించారు. గత మూడు రోజుల నుంచి బుచ్చిలో జోరు వాన కురుస్తుంది. దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పూడికలు తీయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.