'పెద్దపులి అక్కడే ఉంది.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండండి'

'పెద్దపులి అక్కడే ఉంది.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండండి'

కాకినాడ: శంఖవరం మండలం శృంగధార జలపాతం పైన పెద్దపులి ఉందని అధికారులు వెల్లడించారు. కావున శృంగధార , పెదమల్లాపురం, ,బురదకోట, కె మిర్తివాడ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే భారీగా అటవీ శాఖ సిబ్బంది పులిని బంధించడానికి మోహరించారు. ఇక హనుమాన్ బృందాలు, ట్రాంక్విలైజింగ్ టీమ్స్ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.