ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
E.G: నిడదవోలులో ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వల రాంబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.