'డిప్యూటీ సీఎం ఆశయాలతో ముందుకు సాగాలి'
ASR: పాడేరులో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ ఛైర్మన్ డా. వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలను అభినందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు.