స్వర్ణ ప్రాజెక్టు 1,800 క్యూసెక్కుల నీటి విడుదల

ADB: సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి ఎగువ, మహారాష్ట్ర జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1180.1 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు సోమవారం ఉదయం ఒక్క గేటు ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.