వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుల నియామకం

వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుల నియామకం

PLD: వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మాచవరం మండలానికి సంబంధించి కొత్త నియామకాలను ప్రకటించింది. సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా రేగుల గడ్డ, జక్కుల కొండలు ఎంపికయ్యారు. వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా వంకాయల రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సింగరయ్య, రైతు విభాగం అధ్యక్షుడిగా చల్లగుండ్ల రాంబాబు, యువజన విభాగం అధ్యక్షుడిగా చిన్న ఆంజనేయులు నియమితులయ్యారు.