అమ్మవారిని దర్శించుకున్న MLA రాకేష్ రెడ్డి

NZB: హైదరాబాద్ నగరంలో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం లాల్ దర్వాజా బోనాల పండుగలో పాల్గొన్నారు. అలాగే దర్బార్ మైసమ్మ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అన్నారు. అమ్మవారి దయతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.