'బాలయ్య స్వయంగా యాక్షన్ సీన్స్ చేశారు'
'అఖండ 2' మూవీ కోసం భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్‌ను డిజైన్ చేసినట్లు స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ తెలిపారు. బోయపాటి శ్రీను యాక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారని పేర్కొన్నారు. ఈసారి అఘోర పాత్ర విశ్వరూపాన్ని చూపబోతున్నట్లు, ఈ మూవీలో 99% యాక్షన్ సన్నివేశాలను బాలయ్య స్వయంగా చేశారని చెప్పారు. ఇక ఈ చిత్రం DEC 5న విడుదలవుతుంది.