గుంతకల్లు వద్ద ప్రమాదం.. లారీ నుజ్జు నుజ్జు

గుంతకల్లు వద్ద ప్రమాదం.. లారీ నుజ్జు నుజ్జు

ATP: గుంతకల్లు-గుత్తి రోడ్ నేషనల్ హైవే 67 వద్ద మంగళవారం తెళ్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ లారీ అదుపుతప్పి 2 కరెంట్ పోల్స్‌ను ఢీకొంది. ఈ లారీ గుత్తి నుంచి బళ్లారి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.