కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేకపోయా: కోహ్లీ

కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేకపోయా: కోహ్లీ

టీమిండియా, RCB కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం వల్లే కెప్టెన్సీని వదిలేసినట్లు తెలిపాడు. సంతోషంగా ఉండడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. నిరంతరం ప్రజల దృష్టి తనమీదే ఉండడాన్ని భరించలేకపోయినట్లు పేర్కొన్నాడు. కాగా, 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.