AICTE-ప్రగతి స్కాలర్షిప్‌కు కమలాపురం విద్యార్థుల ఎంపిక

KDP: AICTE–ప్రగతి స్కాలర్షిప్కకు కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో ECE గ్రూప్‌కు చెందిన ఎ.నిహారిక, ఎస్.రేష్మా ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. డిప్లమో కోర్సు పూర్తి అయ్యేలోపు వీరికి ప్రతి సంవత్సరం రూ.50 వేల స్కాలర్ షిప్ అందుతుందన్నారు. వీరికి స్కాలర్ షిప్ అందేలా కృషి చేసిన టీంను ఆయన అభినందించారు.