ముగిసిన రాట్నాలమ్మ ఉత్సవాలు

ELR: పెదవేగి మండలం రాట్నాలకుంటలో 5 రోజులుగా కొనసాగుతున్న రాట్నాలమ్మ తిరునాళ్లు బుధవారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని స్వామివారికి శాంతి కల్యాణం చేశారు.