'కార్మిక కోడ్‌ల అమలు దారుణం'
W.G: కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కార్మిక కోడ్లను అమలు చేయడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమసుందర్ ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డు, సీడబ్ల్యూసీ గోడౌన్లలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మిక వర్గ ఆగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.