ఆదోనిలో 260 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

KRNL: ఆదోనిలో అఫిసరాళ్లకొండలో ఎక్సైజ్ సీఐ సైదుల్ ఆధ్వర్యంలో నాటుసారా స్థావరం పై దాడులు చేపట్టారు. ఆదివారం చేపట్టిన ఈ దాడుల్లో 260 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 12 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన బోయ వెంకటేష్‌పై కేసు నమోదు చేయగా, ప్రశాంతనగర్‌కు చెందిన బోయ గుంటెమ్మను అరెస్టు చేశారు.