జిల్లా వ్యాప్తంగా 4.78లక్షల సంతకాల సేకరణ
GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 4,78,000 సంతకాలు సేకరించినట్లు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశామని.. ఇది గొప్ప ప్రజా స్పందన అని అన్నారు.