ఢిల్లీ బ్లాస్ట్.. భారత్‌కు ఇజ్రాయెల్ సంఘీభావం
ఢిల్లీ బ్లాస్ట్ ఘటనపై భారత్‌కు ఇజ్రాయెల్ సంఘీభావం తెలిపింది. భారత ప్రజలకు, ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ ఎప్పుడూ భారత్‌కు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చింది.