ఇబ్రహీంపట్నంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
NTR: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు 'ప్రజాదర్బారు'ల నిర్వహణ నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్తు కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 215 ఆర్జీలు వచ్చాయన్నారు.