కారిగెడ్డపై వంతెన నిర్మించండి

PPM: పాచిపెంట మండలం అమ్మవలస గ్రామ సమీపంలో కారిగెడ్డపై వంతెన నిర్మించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. వర్ష కాలంలో కారిగెడ్డ పొంగి పొర్లడం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని ప్రజలు పేర్కొన్నారు.