‘శ్రేష్ట’ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ATP: ‘శ్రేష్ట’ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఉచితంగా సీటు లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.