రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు

NDL: కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లె గ్రామం వద్ద కారు బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా గాయపడ్డ బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.