గంభీర్ మీద విశ్వాసం ఉంది: BCCI
న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. తమ సెలక్టర్లు, కోచింగ్ స్టాఫ్, హెడ్ కోచ్ గంభీర్ మీద తమకు విశ్వాసం ఉందన్నాడు. తమ ప్లేయర్లపై పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. ప్రతి ఒక్కరికి తమ మద్దతు ఉంటుందని తెలిపాడు.