చంద్రబాబుకు పెద్దిరెడ్డి హెచ్చరిక

AP: సీఎం చంద్రబాబు తప్పకుండా ప్రతిఫలం అందుకుంటారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మిథున్ రెడ్డికి జైలులో వసతులు కల్పించడం లేదని వ్యాఖ్యానించారు.