ఫోన్ మాట్లాడొద్దన్నందుకు భర్తను నరికి చంపిన భార్య

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు భర్తను నరికి చంపిన భార్య

అల్లూరి: జిల్లాలోని చింతపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడూరు గ్రామంలో అతిగా ఫోన్ మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొడ్డలితో నరికింది. తీవ్ర గాయాలపాలైన భర్తను స్థానికులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడిని కోర రాజారావుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.