ఎన్టీఆర్ కీర్తి పురస్కారం అందుకున్న గుమ్మిలేరు వాసి

కోనసీమ: డాక్టర్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన వ్యక్తికి ఎన్టీఆర్ కీర్తి పురస్కారం లభించింది. పాన్ ఇండియా పిలంత్రోపిక్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటున్న వారి సేవలకు గుర్తింపుగా డాక్టర్ ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలను శనివారం విజయవాడలో ప్రదానం చేశారు.