విద్యుత్ షాక్ తో గేదే మృతి..
SRPT: విద్యుత్ షాక్‌తో గేదె మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన చిమట నాగరాజు గేదె రోజువారీగా ఇవ్వాళ మేతకు వెళ్ళగా పుట్టపాక వెంకన్న పొలంలో త్రీఫేస్ విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెందినట్లు బాధితుడు చిమట నాగరాజు తెలిపారు. గేదె మరణించడంతో కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు.