'కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి'
KMR: గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిశనివారం ప్రారంభించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు బీస గణేష్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు.