'వైద్యసేవలో నియోవిజన్ సేవలు మరువలేనివి'
విశాఖ: చూపు కోల్పోయిన అభాగ్యులకు వెలుగు చూపే నియోవిజన్ వైద్యుల సేవలు అపూర్వమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. భీమిలి జోన్ 3వ డివిజన్ వాణిజ్య సముదాయంలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా, 20 మందికి కళ్లజోడులు, 30 మందికి కాటరాక్ట్ శస్త్రచికిత్స సిఫార్సు చేశారు.