చిరు బర్త్ డే.. స్పెషల్ వీడియో చేసిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి తన 70వ పుట్టినరోజును ఫ్యామిలీతో కలిసి గోవాలో జరుపుకుంటున్నారు. ఈ మేరకు చిరు తనయుడు రామ్ చరణ్.. తన తండ్రికి విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేశారు. దీనికి 'నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరు. నా ప్రతి విజయం, నేను మోసే విలువలు అన్నీ మీ నుంచే వచ్చాయి. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు.