ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం

ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని ఎంఈఓ కార్యాలయం నందు శనివారం ప్రపంచ పత్రికా దినోత్సవ వేడుకలను పాత్రికేయులు, పోలీసులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విద్యాశాఖ తరఫున ఎంఈఓ కోటేశ్వరరావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా ఉన్న జర్నలిస్టులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.