VIDEO: నర్సీపట్నం బేకరీలో భారీ అగ్ని ప్రమాదం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శారదా నగర్‌లో గల బేకరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పర్ స్వామి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని లీడింగ్ ఫైర్ మెన్ శివ తెలిపారు. అయితే, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.