'వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి'

KDP: మైలవరం మండల ప్రజలు వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్, తదితర శాఖల ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మైలవరం ఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. గ్రామ పోలీసు అధికారిని సంప్రదించి అనుమతులు పొందాలన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమ వివరాలను పోలీసు శాఖకు తెలియజేయాలని ఆయన సూచించారు.