మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య

మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య

NGKL: తెలకపల్లి మండలం గోళగుండం గ్రామానికి చెందిన భార్గవి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. ఈ నెల 15న వివాహ సంబంధం నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన ఆమె అదే రోజు పురుగుల మందు తాగింది. గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. లింగాల మండలం కోమటికుంటకు చెందిన కడెం బాలకృష్ణతో ఆమె సన్నిహితంగా ఉండేదని తండ్రి ఫిర్యాదు చేశారు.