'పేదలకు దక్కని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు'
MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని గోపాలగిరి గ్రామానికి వెళ్లే రోడ్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపయోగంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు పంపిణీ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.