'ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి'
కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు.