చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం: జవహర్

ప.గో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి కె. ఎస్ జవహర్‌కు కొవ్వూరులో గురువారం టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే మనందరి ముందున్న లక్ష్యం అని అన్నారు.