VIDEO: జమిందారు కోటలో నేటికీ మోగుతున్న కంచు గంట

కృష్ణా: పూర్వం గడియారం లేని రోజుల్లో రాజులు, జమిందారులు ప్రతి గంటకోసారి కంచు గంటలు మోగించి తమ రాజ్య ప్రజలకు సమయాన్ని తెలియజేసేవారు. ఆధునిక యుగంలో సమయం తెలుసుకోవటం సులభమైపోయింది. అయినప్పటికీ పూర్వపు అరుదైన కంచు గంటను నేటికీ చల్లపల్లి జమిందారు కోటలో మోగిస్తున్నారు. ప్యాలెస్ సిబ్బంది ప్రతి గంటకు కంచుగంట మోగించి సమయాన్ని తెలియజేస్తారు.