జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. కలెక్టర్
WGL: వరంగల్ జిల్లా ప్రజలకు, అధికారులకు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. హోలీ మన సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పండుగని, చెడుపై మంచి విజయం సాధించిన సంకేతమని తెలిపారు. హోలీ ఆడిన తర్వాత చెరువులు, వాగులు, నదుల్లో స్నానాలకు వెళ్లవద్దని, సరదా మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయని కలెక్టర్ సూచించారు.