రోడ్లకు మరమ్మతులు చేయించిన వెలిగండ్ల ఎస్ఐ

ప్రకాశం: వెలిగండ్లలోని ప్రధాన రహదారులకు స్థానిక ఎస్ఐ మధుసూదన్ రావు మరమ్మతులు చేయించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలు జరగకుండా రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయించామన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్ల చెట్లను జేసీబీ సాయంతో తొలగించి, ప్రమాద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.