దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు

దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు

దేశంలోని ఇంధర నిల్వలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. అలాగే అమెరికా, రష్యా, ఆస్ట్రేలియ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల LPG సముద్ర మార్గంలో భారత్‌కు వస్తోందని చెప్పింది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. ఇంధన కొరతపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని కోరింది.