హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రారంభం

SKLM: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ పి.వి.వి.వి.డి. ప్రసాద్ రావు, నగరపాలక సిబ్బందితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.