పాఠశాలలో 3 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు
కృష్ణా: పెనమలూరు(M) కృష్ణనగర్ కానూరులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన బడి– మన భవిష్యత్ పనులు 3 ఏళ్లుగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడం, ఆట స్థలం మట్టి దిబ్బలతో నిండిపోవడం, పాఠశాల గేటు వద్ద చెత్త కుప్పలు ఉండడం విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.