VIDEO: 'చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'
ADB: ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి హక్కులను సాధించుకోవాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ జంగుబాపు అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని కిన్నెరపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.