'ఎర్ర సత్యం ఉన్నారంటే పేదలకు 7 ఏనుగుల బలం'

'ఎర్ర సత్యం ఉన్నారంటే పేదలకు 7 ఏనుగుల బలం'

MBNR: ఎర్ర సత్యం ఉన్నారంటే పేద ప్రజలకు 7 ఏనుగుల బలం ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో నిర్వహించిన ఎర్ర సత్యం వర్ధంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్ర సత్యం ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.