సర్పంచ్ పదవికి పోటీ.. ఆశా కార్యకర్తకు రాజీనామా!
WNP: పాన్‌గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ముంత పార్వతి ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 20 ఏళ్లుగా ఆశా కార్యకర్తగా సేవలందిస్తున్న ఆమెకు జీపీలో బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో భర్త ప్రోత్సాహం, పార్టీ నేతల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. కాగా, గ్రామాల్లో ఎన్నికలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి.