కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పుష్కరఘాట్ వద్ద గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బుధవారం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 12.25 మీటర్ల ఎత్తులో 10.2 లక్షల క్యూసెక్కుల వరద పారుతోంది. రెండు గంటల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.