ఎన్నికల్లో BJP 100% పోటీ: బండి సంజయ్

ఎన్నికల్లో BJP 100% పోటీ: బండి సంజయ్

HYD:GHMC లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఓటింగ్‌లో కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని, తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ సమీకరణాన్ని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.