మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండలాల్లోని యువత కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.