కలగట్లలో ఎస్సై శ్రీరామ్ పల్లెనిద్ర

కలగట్లలో ఎస్సై శ్రీరామ్ పల్లెనిద్ర

ప్రకాశం: కనిగిరి మండలంలోని కలగట్ల గ్రామంలో ఎస్సై టీ. శ్రీరామ్ గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారికి తెలిపారు.